అమ్మ ఒడి పధకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేయాలి || NEWS9 TODAY ||

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

కృష్ణాజిల్లా మైలవరం అమ్మ ఒడి పధకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేయాలని APPSA(ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్)నాయకులు కోరారు.మైలవరం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ
ఆరోగ్య శ్రీ,ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పధకాల వలనే అమ్మ ఒడి ని కూడా ప్రైవేట్ పాఠశాలల విద్యార్ధుల తల్లులకు వర్తింపజేయాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మ ఒడి వర్తింపజేసిన పక్షాన ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న
మధ్యతరగతి తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చినట్లైతే లక్షల మంది ప్రైవేట్ ఉపాద్యాయుల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు.రాష్ట్రంలో 50శాతం విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని,ధనికులు
కార్పోరేట్ పాఠశాలల బాట పట్టగా ఎక్కువ శాతం పేద,మద్య తరగతి కుటుంబాల వారే తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని అన్నారు.ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించి అవసరమైన పక్షంలో ఒక కమిటీని వేసి ప్రైవేట్ పాఠశాలలను
కూడా ప్రభుత్వమే నడుపుతూ తమను తమ ఉద్యోగులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి మీడియా ద్వారా విన్నవిస్తున్నామని APPSA కృష్ణాజిల్లా గౌరవాధ్యక్షులు మోహనరావు కోరారు.

Comments

Comments are disabled for this post.