SRI SHUKHABRAMASHRAMAM AVARANALO UCHITHA YOGA SHIKSHANA || SRIKALAHASTHI || NEWS9 TODAY ||

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ శుకబ్రమాశ్రమం ఆవరణలో వేసవి ఉచిత యోగ శిక్షణ కార్యక్రమము గత నెలరోజులుగా జరుగుతుంది. ఈ నెలరోజు విద్యార్థులు క్రమంతప్పకుండా హాజరైన విద్యార్థులకు ప్రోత్సాహముకొరకు యోగ శిక్షణ ప్రశంస పత్రాలు
శ్రీ శుకబ్రమాశ్రమం పీఠాధిపతులు పూజ్యశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి మరియు యోగ అధ్యాపకులు మార్కండేయులు వారి చేతులు మీదుగా విద్యారులకు అందిచడం జరిగినది. ముందుగా విద్యార్థులచే యోగప్రక్రియలు, ప్రణయం, ఓంకార
నామాలు, భగవత్గీత లోని పద్యాలూ,వ్యాసాలు ఉచ్చరించటం ..మొదలైనవి చేసినారు. అనంతరం శ్రీ శుకబ్రమాశ్రమం పీఠాధిపతులు పూజ్యశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి విచ్చేసి కార్యక్రమమును ప్రారంభించి విద్యారులకు యోగ శిక్షణ
ప్రశంస పత్రం అందించారు.ఈ కార్యక్రమములో సుమారు 100 మంది విద్యార్థులు ప్రశంస పత్రాలు అందుకున్నారు. అలాగే వీరు మాట్లాడుతూ……. పూజ్యశ్రీ విద్య ప్రకాశనందగిరి స్వామివారి ఆశీర్వాదంతో ఈ వేసవి ఉచిత యోగ శిక్షణ పట్టణంలోని
ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ యోగ ప్రక్రియవల్ల మనసు సుద్దిపడుతుంది, దానివల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది, వ్యాధులు దరిదాపుల్లోకి రావు అన్నారు. అలాగే యోగా అనేది భారతదేశపు ప్రత్యామ్నాయ చికిత్సలకు చెందిన పురాతన
రూపం. యోగ అనేది సంస్కృత పదం, సాహిత్యపరంగా “చేరుటకు, ఏకం చేయటానికి లేదా జోడించుటకు” అని అర్థం. శరీరం మరియు మనసును ఏకం చేయటానికి యోగ సహాయపడుతుంది. మీ మనసు శుభ్రపరచి, శారీరకంగా ఫిట్ గా
ఉంచుతుంది.యోగ యొక్క శక్తి మీ ఆలోచనలను లోపల నుండి బయటకు వెలికి తీస్తుంది. యోగ మరియు ధ్యానం యొక్క నిర్మలమైన శక్తి మీ జ్ఞానమును నిలిపి ఉంచడానికి సహాయం చేస్తుంది.అలాగే యోగ అధ్యాపకులు మార్కండేయులు
మాట్లాడుతూ…..”యోగకు శరీరం అనువుగా ఉన్న వారు మాత్రమే అనుసరించాలి” అనేది ఒక అపోహ మాత్రమే. యోగ ప్రతి ఒక్కరికోసం, అధిక బరువు లేదా అల్ప బరువు, శరీరం మంచి ఆకృతి లేని వారికి, లింగం లేదా వయసులో తేడా అనే
వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరు యోగను చేయవచ్చు. శరీరం సౌకర్యంగా లేని వారికి యోగాసనాల ద్వారా సరిచేసుకోవచ్చు. వీటన్నిటిని కన్నా మనసు సౌకర్యంగా ఉండటం చాలా అవసరం. యోగను మీరు తప్పక ఇష్టపడతారు ఎందుకంటే,
మనసు, తనువును ఎలా ఆధీనంలో ఉంచుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది.

Comments

Comments are disabled for this post.